‎Bollywood: సహనం కోల్పోయి అభిమానిపై సీరియస్ అయిన హీరో.. వీడియో వైరల్!

Bollywood: మామూలుగా సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు అభిమానులు ఫోటోగ్రాఫర్లు వెంటపడుతూ వారి ఫోటోలను తీస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తే మరికొందరి మాత్రం ఫోటోలు తీయొద్దు అంటూ రిక్వెస్ట్ గా చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది వినకుండా అలాగే ఫోటోలు వీడియోలు తీస్తున్నప్పుడు సెలబ్రిటీలు కూడా సీరియస్ అవుతూ ఉంటారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

‎అభిమానులపై, ఫోటోగ్రాఫర్లపై గతంలో చాలామంది సెలబ్రిటీలు మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక స్టార్ హీరో సహనం కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగింది? ఇంతకీ ఆ హీరో ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కి తాజాగా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురయింది. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వీధుల్లో ఎంతో స్వేచ్ఛగా, జాలీగా తిరుగుతూ కనిపించారు.

https://twitter.com/Ak_msd_fan/status/1946975468537692497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1946975468537692497%7Ctwgr%5Eb829adaaf9c800eff3cb5c9425f385a65d421089%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fbollywood-actor-akshay-kumar-loses-cool-grabs-fans-camera-for-filming-him-without-consent-in-london-watch-video-1586270.html

‎ అయితే అక్షయ్ కుమార్ ను గుర్తించిన ఒక అభిమాని వెంటనే తన మొబైల్ లో నటుడిని ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఇది గమనించిన అక్షయ్ వెంటనే అభిమాని ఫోన్ లాక్కున్నాడు. అతని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలు, వీడియోలు తీయడం సరైనది కాదంటూ మండి పడ్డాడు. అయితే చివరికి ఆ అభిమానితో కలిసి అక్షయ్ కుమార్ సెల్ఫీకి ఫోజులిచ్చినట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియో పై అభిమానులు నెటిజన్ స్పందిస్తూ ఇలా సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు ఫోటోలు తీయడం ఎందుకు వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదంటూ సదరు అభిమానిపై మండిపడుతున్నారు.