పూర్తి బూతు :‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ కథ ఇదే

బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ హారర్ కామెడీ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ రోజు ( మార్చి 21 వ తేదీ) ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు తమిళ మూవీ కి తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు . ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో అసలు కథేముంది అనే విషయం చూద్దాం.

వీర ఓ ప్లే బోయ్ అనే విషయం తెలిసి ప్రతీ పెళ్లి కూతురు రిజెక్ట్ చేస్తూంటుంది. కానీ ఓ అమ్మాయి ఇతన్ని చేసుకోవటానికి ముందుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది. తనని ఓ ట్రిప్ కు తీసుకెళ్లి తనని ఇంప్రెస్ చేయాలని, ఒకరినొకరు అర్దం చేసుకోవాలని అంటుంది. అంతేకాకుండా ఇంకో కపుల్ ని కూడా తమతో పాటు తీసుకెళ్దాం అంటుంది. వీరా తన ఫ్రెండ్ వాసుని , అతని గర్ల్ ప్రెండ్ కావ్యా ని తమతో పాటు రమ్మంటాడు. కావ్య వీరా మాజీ లవరే. వీళ్లంతా కలిసి ధాయిలాండ్ వెళ్లి అక్కడో బంగ్లా లో అద్దెకు దిగుతారు. అయితే ఆ బంగ్లా ని చూసుకునే వ్యక్తి…ఓ ప్రత్యేకమైన గదిని చూపించి అందులోకి మాత్రం వెళ్లద్దంటాడు.

అయితే ఓ రోజు వాసు, వీరాలు ఇద్దరూ ఓ వయాగ్రని యాక్సిడెంటల్ గా వాడతారు. ఈ లోగా వాళ్ల గర్ల్ ప్రెండ్స్ వస్తారు. వాళ్ల దృష్టిలో తాము చీప్ గా ఉండకూడదని మూసి ఉన్న గదిలోకి వెళ్ళి దాక్కుందామనుకుంటారు. అక్కడ దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం వాళ్లను వెంటాడటం మొదలెడుతుంది. అదొక ఆడదెయ్యం. తాను ఓ యాక్సిడెంట్ లో చనిపోయానని ..తను వర్జిన్ గా మరణించానని, తన ఆత్మ శాంతించాలంటే మరో వర్జిన్ తో తను శృంగారం చేయాలని అంటుంది. అది విన్న హీరోలిద్దరూ పారిపోదామనుకుంటారు. కానీ ఆ దెయ్యం వీళ్లను వదిలిపెట్టదు. వీళ్ల తో ఎలాగైనా శృంగారంలో పాల్గొనాలని ప్రయత్నాలు చేస్తుంది.

ఈ లోగా వాళ్లతో పాటు వచ్చిన ఆ అమ్మాయిలకు ఆ విషయం తెలుస్తుంది. దాంతో వాళ్లు జాక్, రోజ్ అనే ఇద్దరిని పిలిపిస్తారు..దెయ్యం నుంచి తప్పించటానికి. అయితే వాళ్లిద్దరు నిజానికి మోసగాళ్లు. అక్కడకు వచ్చాక వాళ్లకు తెలుస్తుంది. అక్కడ నిజం దెయ్యం ఉందని. దాంతో వాళ్లు కూడా వర్జిన్స్ కావడం ఆ దెయ్యం వాళ్లను సెట్ చేయాలని చూస్తుంది. ఈలోగా మరొకరు అక్కడకి వచ్చి అలాగే బుక్కయిపోతారు. చివరకు ఆ దెయ్యం బారి నుంచి తప్పించుకునేందుకు ఏం చేసారు.. చివరకు ఏమైందనేదే మిగతా కథ.

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ యూత్ కి మాత్రమే, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కాదని దర్శకుడు సంతోష్ P జయకుమార్ సంకోచించకుండా చెప్పారు. PSV గరుడ వేగ, 24 కిస్సెస్ వంటి విభిన్న చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన అదిత్ అరుణ్ మాట్లాడుతూ కథ నచ్చి ఈ మూవీ లో హీరో గా నటించానని చెప్పారు. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. సెన్సార్ బోర్డ్ చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ కి A సర్టిఫికేట్ ఇచ్చారు. బాలమురళి బాలు సంగీతం అందించారు.