చరణ్ మరోసారి గాయపడ్డాడా !

చ‌ర‌న్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో చ‌ర‌ణ్ గాయ‌ప‌డడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. మూడు వారాల త‌ర్వాత ఆయ‌న పూర్తిగా కోలుకోవ‌డంతో మ‌ళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా ఆయ‌న మ‌రోసారి గాయ‌ప‌డ్డాడంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అయింది. దీంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీసారు. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ తెలిపిన వివరాలు ఆయ‌న ఎంతో సుర‌క్షితంగా ఉన్నారు. నిన్న, ఈ రోజు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.