బాలయ్యలో మార్పులు..  స్క్రిప్టులో చేర్పులు ! 

నట సింహం నందమూరి బాలయ్య అనే పేరు వింటేనే భారీ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకువస్తాయి. ఏమైనా బాలయ్య సినిమాలు నందమూరి అభిమానుల కోసమే అన్నట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్యలో మార్పు వచ్చింది. కేవలం తన అభిమానులు మాత్రమే సినిమా చూస్తే.. బాక్సాఫీస్ వద్ద ప్రతి సినిమాకి దుకాణం సర్దుకోవాల్సి వస్తోంది. అందుకే బాలయ్య మొత్తానికి తనలో వచ్చిన మార్పుతో పాటు తన సినిమాల శైలిని కూడా మార్చబోతున్నాడు. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య ఇదివరకటిలా లేదట. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని తన సినిమాలు ఉండాలని తన డైరెక్టర్స్ కి మెసేజ్ చేశాడు.

ఇక నుండి తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలనేది బాలయ్య మొదటి కండిషన్. బాలయ్యకు కథ చెప్పాలనుకుంటే కథలో కొత్త పాయింట్ ఉండాలి. అప్పుడే బాలయ్య దగ్గరకు కథ చెప్పడానికి వెళ్ళాలట. ఒకవేళ పాత చింతకాయ పచ్చడి కథతో గాని, బాలయ్య దగ్గరకు వెళ్తే తొక్కు పచ్చడి చేయడం ఖాయం. అందుకే బాలయ్యకు కథ చెప్పాలనుకునే డైరెక్టర్లూ జర జాగ్రత్త. అన్నట్టు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏముందో చూడాలి.

ఇక ఈ సినిమా కూడా ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే బాలయ్య కనిపించడం ఆనవాయితీ కాబట్టి అలానే కనిపిస్తాడు. అయితే బాలయ్య రెండు పాత్రల్లో ఒక పాత్ర కొత్తగా కనిపించాలని బాలయ్య బలంగా కోరుకుంటున్న క్రమంలోనే బోయపాటి స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు. మెయిన్ గా బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశాడట. ఏమైనా బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకుంటే.. కోల్పోయిన మార్కెట్ ను అండ్ స్టార్ డమ్ మళ్ళీ రాబట్టుకోవచ్చు.