Home Tollywood గమనించారా? 'గూఢచారి' సీక్వెల్ ప్రకటనలోనే ట్విస్ట్

గమనించారా? ‘గూఢచారి’ సీక్వెల్ ప్రకటనలోనే ట్విస్ట్

గూఢచారి చిత్రం చివరలో ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇస్తూనే ముగించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ కి సంబంధించిన కథను రెడీ చేసే పనిలో అడివి శేష్ కొంతకాలంగా బిజీగా వున్నాడు. ‘గూఢచారి’లోని ప్రధాన పాత్రల పరిధిని పెంచుతూ ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ‘గూఢచారి’ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ముఖ్యమైన పాత్రను పోషించిన రాహుల్ పాకాల, ఈ సీక్వెల్ కి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు నిర్మాతలు అభిషేక్ పిక్చర్స్ వారు ప్రకటించారు. ఈరోజు అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్‌ ప్రకటన వచ్చింది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు మొదలైనట్లు వెల్లడిస్తూ ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Goodachari2 | Telugu Rajyam

2019 జూన్‌ నుంచి షూటింగ్ మొదలుకానుందట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ చిత్రానికి డైరక్టర్ మారిపోవటమే అందరికీ ఆశ్చర్యం అనిపిచింది. రాహుల్‌ పాకాల దర్శకత్వం ఈ సీక్వెల్ కు డైరక్షన్ వహించనున్నారని ప్రకటన చేయటమే ట్విస్ట్ ఎవరూ ఊహించలేదు.

ఇక ఆగస్ట్‌లో విడుదలైన ‘గూఢచారి’ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరించారు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, మధు శాలిని, రవిప్రకాశ్‌, సుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ ఈ చిత్రాన్ని జేమ్స్‌ బాండ్‌ స్థాయినలో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మరి ఆ డైరక్టర్ ని ఎందుకు ప్రక్కన పెట్టారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్టర్‌లో ‘గూఢచారి విల్‌ బీ బ్యాక్‌’ అని రాసుంది. ‘2’ అనే నెంబర్‌లో అడివి శేష్‌ను వెనక నుంచి చూపించారు. ఇందులో శ్యాంగా కీలక పాత్ర పోషించిన వెన్నెల కిశోర్‌ సీక్వెల్‌ గురించి స్పందిస్తూ..‘నేను కూడా ఇందులో భాగమైతే బాగుండు’ అంటూ ట్వీట్ చేసారు.

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

Related Posts

Latest News