‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఫస్ట్ టైమ్ మాట్లాడిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ తీసారని చెప్పబడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఆంధ్రా మినహా అంతటా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగుదేసం వాళ్లు, చంద్రబాబు కావాలనే సినిమా ఆపుచేయటానికి ప్రయత్నించారని అంతటా చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా విషయమై చంద్రబాబు నోరు మెదపలేదు. అసలు ఈ ఇష్యూ లేనట్లే ఆయన ప్రవర్తించారు. అయితే తొలిసారిగా ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తనపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ…ప్రెస్ మీట్ రోడ్డుపై కాకుంటే ఈసీ కార్యాలయంలో పెట్టుకోమనండి ఇక మరో వ్యక్తి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని భావించాడు , ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు అతనికి అనుమతి తిరస్కరించారు. రోడ్డుపై మీడియాతో మాట్లాడతానని ప్రయత్నించాడు , రోడ్డుపై కాకుంటే , అతను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళవచ్చు అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోమనండి అని వర్మనుద్దేశించి మాట్లాడారు చంద్రబాబు .

అలాగే ..తెలంగాణలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కొత్త సినిమా ఏంకాదు ఏదేమైనా,ఆ సినిమాతో నన్నేమో చెయ్యాలనుకున్నా నాకే మాత్రం ఆందోళన లేదు అని చంద్రబాబు అన్నారు .

ఇక లక్ష్మీ పార్వతి ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు అంటూ మండిపడ్డారు. ఈసీ విడుదలను అడ్డుకుంటే నాకేం సంబంధం .. మాట్లాడేముందు ఒక డిగ్నిటీ ఉండాలన్న చంద్రబాబు ఏమైనప్పటికీ, చంద్రబాబు సినిమా పేరు గానీ, డైరెక్టర్ పేరుగానీ, లక్ష్మీ పార్వతి పేరుగానీ ప్రస్తావించకుండా తానూ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా తనదైన శైలిలో చెప్పారు.