క్యాస్ట్ ఫీలింగ్ ఉండటం తప్పుకాదు: వర్మ

రామ్‌గోపాల్ వర్మ మరో సరికొత్త వివాదానికి తెరలేపారు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీయార్‌తో వివాదాలు రేకెత్తించిన వర్మ.. ప్రస్తుతంకమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అనే సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఈ సినిమాలో చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలోని క్యాస్ట్ ఫీలింగ్‌కు సంబంధించిన పాటను ఈరోజు (మంగళవారం) విడుదల చేశారు. సిరాశ్రీ రాసిన పాటకు రవిశంకర్ సంగీతం అందించారు. కమ్మలు.. కాపులు.. రెడ్లు.. అంటూ సాగిన ఈ పాటలో.. ఎన్నో ఫీలింగ్‌లు ఉన్న ఈ దేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం తప్పుకాదని పేర్కొన్నారు. అత్యంత వివాదారహితమైన ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాటను కుల ప్రేమికులందరికీ అంకితమిస్తున్నట్టు వర్మ పేర్కొన్నారు.