VJ Sunny: బిగ్ బాస్ విజేతను వదలని కులపిచ్చి.. ఆ కులం ఓట్లతోనే గెలిచాడంటూ.. ట్రోలింగ్స్!

VJ Sunny: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన తర్వాత పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. ఈ సీజన్ కి సన్నీ విజేతగా నిలబడి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ విజేతగా నిలవడంతో పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ లో చాలా మంది సన్నీ నిజమైన పేరు ఏంటి సన్నీది ఏ కులం అంటూ పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు ఈయన పేరు సన్నీ, విజే సన్నీ.. మచ్చా అని పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ ఈయన బిగ్ బాస్ విజేతగా గెలిచిన తర్వాత అరుణ్ రెడ్డి అనే పేరు తెరపైకి వస్తోంది. అసలు సన్నీ నిజమైన పేరు అరుణ్ రెడ్డి అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే కొందరు కుల పిచ్చోళ్లు దీనినే అవకాశంగా చేసుకుని సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు.. రేయ్ మా అరుణ్ రెడ్డి బిగ్ బాస్ విజేత అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి అనే విషయం చాలామందికి తెలియదు బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సందర్భాలలో చాలా మంది వారి ఇంటి పేర్లు పూర్తి పేర్లు చెప్పినప్పటికీ సన్నీ మాత్రం ఎక్కడ తన అసలు పేరు ప్రస్తావించలేదు. అలానే పేరుకు ముందు పేరు తర్వాత తోకలను చెప్పుకోవడానికి సన్నీ ఎప్పుడు ఇష్టపడలేదు అని చెప్పాలి.

ఇక అతను టైటిల్ గెలుచుకున్న తర్వాత సన్నీ గురించి పెద్ద ఎత్తున వెతుకుతూ అతని అసలు పేరు అరుణ్ రెడ్డి అని రావడంతో ఎంతోమంది కుల పిచ్చోళ్లు ఆ కులం పేరుతో పెద్ద ఎత్తున సన్నీని పొగడ్తలతో ముంచెత్తారు ఈక్రమంలోనే మరికొందరు స్పందిస్తూ.. మీ కుల పిచ్చి తగలెయ్య కేవలం మీ కులపు ఓట్లు వేస్తే మాత్రం సన్నీ బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు అంటూ సన్నీ అభిమానులపై కామెంట్లు చేస్తున్నారు.