ఏపీలో రెడ్డీ కులం డామినేషన్ మీద కేంద్రం దృష్టి పెట్టిందా? ఆ లెక్క సరిజేయడానికే బీజేపీ `కాపుల్ని` వెంటేసుకుని తిరుగుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సామాజిక వర్గానికే అన్ని రకాల పదవులు కట్టబెట్టారు అన్నది అందరికీ తెలిసిన నిజం. ముఖ్యమంత్రి చుట్టూ ఉండే కొన్ని పదవులు కాపులు…బీసీలకు ఇచ్చారు తప్ప! ప్రభుత్వంలో మెజార్టీ రెడ్డి దే. ఇదే విషయంపై మరోసారి నర్సాపురం రెబల్ ఎంపీ రఘుమార కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలో ఉన్న రెడ్డీలందర్నీ ఏకదంపుడుగా ఒకేసారి చదివేసారు.
ప్రభుత్వ విప్ ల పదవుల్లో ఇంత మంది రెడ్లున్నారు. ఆ శాఖలో రెడ్డీల జాబితా సాగదీస్తే సాగేంతగా ఉందని చెప్పకనే చెప్పారు. మధ్యలో సినిమా డైలాగుల వేస్తూ తనదైన శైలిలో జగన్ సర్కార్ పై సెటైర్లు వేసారు. ఆ కులంపై కామెడీలు చేసారు. ఇంకా జగన్ క్రైస్తవ మతాన్ని కెలికారు. ఇదంతా ఆయన వెర్షన్..రఘురామ విమర్శలు. వాటిని పక్కనబెడితే బీజేపీ ఏపీలో పాతుకుపోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అందుకే ఒంటరిగా వెళ్తే పనవ్వదని భావించిన పార్టీ ఏపీలో బీసీ ల తర్వాత అధికంగా కాపు కులాన్ని మచ్చిక చేసుకుంటూ పావులు కదుపుతోంది. అలా జనసేన- బీజేపీకి మిత్రపక్షం అయింది.
ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఏపీలో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడీ రెండు పార్టీలు చేయాల్సిన పనేంటి? ప‌్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. జనసేన పార్టీ ఆ విధంగా బీజేపీతో సంబంధం లేకుండా చేయాలనుకున్నది చేస్తోంది. మరి బీజేపీ ఏం చేస్తోంది? కాపుల్ని ఏకం చేసే పనిలో పడింది. అలాగే సీక్రెట్ గా ప్రభుత్వంలో లొసుగుల్ని పసిగడుతూ కేంద్ర దృష్టికి తీసుకెళ్తోంది. ప్రభుత్వంపై వస్తోన్న రెడ్డీ అనే వ్యతిరేకతను అడ్డు పెట్టుకుని రాజకీయ అస్ర్తంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు కదా.