అశోక్ తేజ పై కేసు నమోదు..పాపం అంటున్నారు

ప్రముఖ పాటల  రచయిత సుద్దాల అశోక్‌తేజ ఇప్పుడో కేసులో ఇరుక్కున్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కంపెనీ వల్ల ఆయన ఇరుక్కోవాల్సి వచ్చింది. అశోక్ తేజ ప్రచారం చేస్తున్న సంస్థలో స్థలం కొనుగోలుకు డబ్బు చెల్లిస్తే మోసం చేశారని బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు అశోక్‌తేజపై మోసం కేసు నమోదైంది. ఆ కేసు పూర్వాపరాలు విన్న వాళ్లు ఆయన తప్పేమి లేకపోయినా
ఇరుక్కున్నట్లు అయ్యిందని వాపోతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సౌభాగ్య పవిత్ర భూమి టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ సంస్థ ఎండీ కిరణ్‌కుమార్‌రెడ్డి
2016లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ నాగార్జున నగర్‌లో కార్యాలయం ప్రారంభించాడు. ఈ సమయంలో సంస్థకు ప్రచారకర్తగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ హాజరై బోచర్స్ విడుదల చేశారు.

అశోక్‌తేజ  బ్రాండ్ అంబాసిడర్ గా  చేశారంటే సంస్థ నమ్మకమైందని భావించిన కుత్బుల్లాపూర్‌ ద్వారకానగర్‌కు చెందిన రాయల పద్మావతి, ఆమె భర్త ఆ సంస్థలో స్థలం కొనుగోలుకు అదే సంవత్సరం రూ.2లక్షలు చెల్లించారు. నేటికీ వారికి కేటాయించిన ప్లాట్‌ చూపించకపోగా డ‌బ్బులు కూడా ఇవ్వ‌డంలేద‌ని ద్వారాక‌న‌గ‌ర్‌కు చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు.