విక్రమార్కుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాజమౌళి ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర తాజా షెడ్యూల్ నేటి నుండి బల్గేరియాలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు జక్కన్న. ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపనున్నట్టు సమాచారం. జూలై 30, 2020 న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ కథానాయికగా నటిస్తుంది. సముద్రఖని, అజయ్ దేవగణ్ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.