లెబనాన్ బీరట్‌లో భారీ పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కడ (మిడిల్ ఈస్ట్) పేలుళ్లపై సందేహం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. బీరట్ కంటైనర్ లో సంభవించిన ఈ భయానక పేలుడులో ఏకంగా 113 మంది స్పాట్ లో మరణించగా..దాదాపు 4000 మందికి గాయాలయ్యాయని చెబుతున్నారు.
ఆయిల్ దేశంలో ఈ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వీడియో నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు పెళ్లికి రెడీ అవుతున్న నవవధువు.. పెళ్లి ఫోటోషూట్ లో బిజీబిజీగా ఉంది. ఇంతలోనే చెవులు దద్దరిల్లేలా భారీ బ్లాస్ట్. ఆ పేలుళ్లకు చుట్టుపక్కల పరిసరాలన్నీ దద్దరిల్లిపోయాయి. ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉందో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. లెబనీ వధువు ఆ పేలుడుకి తత్తరపడిపోయింది. ఫోటోగ్రాఫర్ కెమెరా షేకైంది. చుట్టూ ఉన్నవాళ్లు పరుగులంకించుకున్నారు.
స్పాట్ లో ఫోటోషూట్ చేస్తున్న వీడియోగ్రాఫర్ మహమూద్ నకీబుల్ ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీశారు. ఆ వీడియోలో ఫోటోషూట్ పరిసరాల్లోని ఇంటి అద్దాలు ఆ శబ్ధాలకు రాశిగా ఎగిరిపడి భీతావహాన్ని ఆవిష్కరించాయి. అయినా ఆ వధువు అస్సలు భయపడక దేవుడిపై నమ్మకం ఉంచిందట. ఆ తర్వాత ఫోటోషూట్ పూర్తి చేసి భర్తతో కలిసి డిన్నర్ కి వెళ్లిందట. పైగా అమెరికన్ల బుద్ధి మారాలంటూ చీవాట్లు పెట్టింది. దేవుడిని నమ్ముకోమని సెలవిచ్చింది. ఆ కంటైనర్ లో భారీగా అమ్మోనియా అనే రసాయనం ఉంది. ఆ పేలుడుకు భారీగా మంటలు దట్టమైన దుమ్ము ధూలితో పొగలు కమ్ముకున్నా ఈ అమ్మడు భయపడలేదు మరి.
WATCH: This Lebanese wedding photographer captured a bride and groom getting married just as a massive explosion rocked #Beirut.
The couple were unharmed in the blast and took refuge in a house before continuing their ceremony pic.twitter.com/0bMtt2OWC7
— Bloomberg QuickTake (@QuickTake) August 5, 2020