మెగా ఫ్యాన్స్ కి భారీ ట్రీట్.. “గాడ్ ఫాదర్” నుంచి టీజర్ డేట్ వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోగా సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం “గాడ్ ఫాదర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి గాను దర్శకుడు మోహన్ రాజా వర్క్ చేస్తుండగా శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. అలాగే ఆల్ మోస్ట్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుంచి అయితే చిత్ర బృందం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోసం ఒకసాలీడ్ అప్డేట్ ని అందించారు.

ఈ ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ముందు రోజే ఈ సినిమా మస్సివ్ టీజర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేసారు. దీనితో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా..

చిత్ర నిర్మాతలు అయితే ఈ దసరా కానుకగా రిలీజ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. మరి గతంలో వచ్చిన గ్లింప్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదు. మరి ఈ టీజర్ అయినా కూడా అంచనాలు అందుకునే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాల్సిందే.