తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్ ల కు అనుమతిచ్చిన నేపథ్యంలో ఈనెలలో టీవీ సీరియల్స్ లో షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభమైన రెండు రోజులకే సీరియళ్ల షూటింగ్ పై పంచ్ పడింది. టీవీ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆయన తో పాటు ఉన్నవారికి, షూటింగ్ లో పాల్గొన వారికి కరోనా అంటుకోవడం ఖాయమని మీడియా కథనాలు వేడెక్కించాయి. ఆయనతో పాటు ఉన్న 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…అందరికీ నెగిటివ్ వచ్చిందని తాజాగా బయటకొచ్చింది.
దీంతో మిగతా నటులంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా సీరియళ్ల యూనిట్లకు కూడా ఉపశమనం దొరికింది. ప్రభాకర్ ఒకేసారి చాలా సీరియళ్లలో నటించడంతో ఆ యూనిట్లు అన్ని కూడా టెన్షన్ లో పడ్డాయి. తాజా పరీక్షలతో అనుమానాలు అన్ని తోలగిపోయాయి. అయితే ప్రభాకర్ కు కరోనా రావడానికి కారణంగా ప్రభుత్వం ఇచ్చిన గౌడ్ లైన్స్ పాటించకపోవడం వల్లేనని ప్రచారం సాగింది. షూటింగ్ సమయంలో భౌతిక పాటించకపోవడం, శౄనిటైజర్ తో శుద్ది చేసుకోకపోవడం, ముఖానికి మాస్కులు వేసుకోకపోవడం వంటివి చేసినట్లు మీడియా దృష్టికి వచ్చింది.
కరోనా మాకు అంటుకోదు లే అన్న ధీమా టీవీ నటులు భావించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే ప్రభాకర్ కు కరోనా రావడంతో అంతా బెంబేలెత్తిపోయారు. సెట్ లో వాతావరణంపై టీవీ ఆర్టిస్టు యూనియన్లు కూడా హెచ్చరించాయి. కానీ చేతులు కాలితే గానీ గాయం విలువ తెలియదుగా! చివరికి అలాగే జరిగింది. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం సూచనల ప్రకారం వెళ్తే మంచిదన్న విషయం అందరికీ అర్ధమైంది. ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో సీరియళ్లు పున ప్రారంభం కావడంతో బుల్లి తెర ప్రేక్షకులు ఆనందానికి అవధులే లేవ్.