బాలీవుడ్ యంగ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ సక్సెస్ ట్రాక్ గురించి తెలిసిందే. అందానికి అందం సెక్సప్పీల్ .. నటప్రతిభ ఈ అమ్మడి సొంతం. అందుకు తగ్గట్టే యువతరంలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక భూమి రెగ్యులర్ ఫోటోషూట్లు యువతరంలో హాట్ టాపిక్. లేటెస్టుగా ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో అంతకంతకు హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇకపోతే 75 ఏళ్ల అమితాబ్ సైతం భూమి ప్రతిభకు వీరాభిమాని. అలాగే అమితాబ్ కి భూమి కూడా అంతే అభిమాని. భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో అమితాబ్ ని ‘బాలర్’ అని పిలవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. “మీరు బ్యాలర్ సార్” అని భూమి రాసింది.. దీనికి “భూమి ఇహ్? వాట్ బ్యాలర్… వో జో బాల్ ఫెంక్తా హై (బంతిని విసిరేవాడు) !!! ” అంటూ అమితాబ్ స్పందించారు. ఇక వీటిపై యువతరం సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నే పాస్ చేసింది. ఇకపోతే భూమి పెడ్నేకర్ నటించిన సినిమాలు కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కొరోనా వైరస్ ఉపశమనం కోసం నిధుల సేకరణ కోసం అమితాబ్ – భూమి ఇటీవల జరిగిన ఐ ఫర్ ఇండియా కచేరీలో పాల్గొన్నారు. వీరితో పాటు అంతర్జాతీయంగా పేరున్న స్టార్లు ఆన్‌లైన్ కచేరీలో భాగం అయ్యారు. కరణ్ జోహార్, జోయా అక్తర్ చొరవతో మొత్తం రూ .52 కోట్లు సేకరించారు. ఇదే కాకుండా, అమితాబ్ ఫ్యామిలీ ప్రత్యేకించి లఘు చిత్రంలో నటించింది.