ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్ట్ చేసి ‘రోబో 2.0’ గురువారం విడుదలైంది.సూపర్ స్టార్ రజినీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. దాదాపు రూ.550కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం టాక్ పాజిటివ్ గా ఉండటంతో శంకర్ , టీమ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో… శంకర్ తదుపరి చిత్రం ‘భారతీయుడు-2’ లాంచ్ కు సంబందించిన ప్రకటన వచ్చింది. ఈ సినిమాని కూడా ఇదే సంస్థ నిర్మించనుంది.
శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలచిన చిత్రం ‘ఇండియన్’. తెలుగులో ‘భారతీయుడు’గా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ఇండియన్-2 రాబోతోంది. తెలుగులో ఇది ‘భారతీయుడు-2’గా రానుంది. దీన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల 14 నుంచి ప్రారంభం కానుంది.
‘2.0’ సినిమా ప్రమోషన్లో భాగంగా శంకర్, అక్షయ్ కుమార్, నిర్మాత కరణ్ జోహార్ ముంబయ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలోనే ‘ఇండియన్ 2’ సినిమా డిసెంబరు 14న ప్రారంభం కానుందని కరణ్ జోహార్ రివీల్ చేశారు.
ఇక ‘భారతీయుడు’ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన సేనాపతి (తండ్రి కమల్ పాత్ర) పాత్రను ‘ఇండియన్ 2’లో కూడా కొనసాగించబోతున్నారట శంకర్. ఇప్పటికే సేనాపతి పాత్రకి టెస్ట్ షూట్ చేసి కమల్ లుక్ ఫైనల్ చేశారట.ఈ చిత్రంలో మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అప్పటి‘భారతీయుడు’ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రాన్ని తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నారు. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘భారతీయుడు’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.