హీరోయిన్ గొడ్డలితో నరుకుతూ.. :‘భైరవగీత’కొత్త ట్రైలర్‌

 సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న చిత్రం భైర‌వ‌గీత‌.ఆయన శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి చెందిన మరో ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇంత‌క ముందు ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Bhairava Geetha Trailer | Dhananjaya | Siddhartha Thatholu | Irra Mor | RGV

‘ఒక్కసారి కార్చిచ్చు పేట్రేగినాక దానికి పులికి, జింకకు భేదం తెలియదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఇంట్రస్టింగ్ గా ప్రారంభమైంది. ‘నిన్న నీకు జరిగినాది.. ఈరోజు నాకు.. రేపు ఇంకొకడికి ఇదే జరిగే వరకు ఎదురుచూస్తే మన బతుకులకు అర్థం ఉండదు’ అని హీరో చెబుతున్నారు. హీరోయిన్ ఇర్రా గొడ్డలి పట్టి.. చివర్లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. రక్తం, హింసతో పూర్తిగా ఫ్యాక్షన్‌ తరహా సన్నివేశాలతో ఈ ట్రైలర్ నిండిపోయింది.

తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలుస్తోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.