వర్మ దొరికిపోయాడు…ఓ రేంజిలో సెటైర్స్ ,కౌంటర్స్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న చిత్రం భైర‌వ‌గీత‌.ఆయన శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు. అయితే నిన్నటి వరకూ.. 2.0 చిత్రానికి పోటీగా తమ చిత్రం విడుదలవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రచారం భారీ ఎత్తున చేసాడు చేశారు. పెద్ద దర్శకుడి చిత్రానికి పోటీగా చిన్న దర్శకుడి చిత్రం విడుదల చేస్తున్నామని, పెద్ద దర్శకుడు తీసిన చిన్న పిల్లల సినిమా 2.0 అని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌లు కూడా చేశారు.

అయితే ఎవరూ ఊహంచని విధంగా …భైరవగీత చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నట్లు వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ‘‘కొన్ని సెన్సార్‌ సాంకేతిక కారణాల వల్ల సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన భైరవగీత సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నాం. ఈ ఎన్నికల రోజు మీ ఓటు భైరవ గీత సినిమాకు వేయండి’’ అంటూ ఆర్‌జీవీ ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆయన్ని కామెట్స్ చేస్తున్నారు.సెటైర్స్ వేస్తున్నారు. 2.0 కు భయపడే రిలీజ్ వాయిదా వేసారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో బిజినెస్ కాకపోవటం..థియోటర్స్ దొరక్క పోవటం రిలీజ్ కు సమస్యగా మారిందని సినీ పరిశ్రమ టాక్.

Bhairava Geetha Trailer | Dhananjaya | Siddhartha Thatholu | Irra Mor | RGV

‘ఒక్కసారి కార్చిచ్చు పేట్రేగినాక దానికి పులికి, జింకకు భేదం తెలియదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఇంట్రస్టింగ్ గా ప్రారంభమైంది. ‘నిన్న నీకు జరిగినాది.. ఈరోజు నాకు.. రేపు ఇంకొకడికి ఇదే జరిగే వరకు ఎదురుచూస్తే మన బతుకులకు అర్థం ఉండదు’ అని హీరో చెబుతున్నారు. హీరోయిన్ ఇర్రా గొడ్డలి పట్టి.. చివర్లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. రక్తం, హింసతో పూర్తిగా ఫ్యాక్షన్‌ తరహా సన్నివేశాలతో ఈ ట్రైలర్ నిండిపోయింది.

తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలుస్తోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.