నిమ్మకూర్ లోఎన్టీఆర్ బయోపిక్ సందడి (వీడియోలు)

సినీ హీరో బాలకృష్ట, దర్శకుడు క్రిష్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ కు అనుకూల ప్రాంతాలను పరిశీలించారు. 2019 జనవరి 9 న సినిమా విడుదల చేస్తామని దర్శకుడు క్రిష్ తెలిపారు. నిమ్మకూరులో బాలకృష్ణ, క్రిష్ సందడి చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.