పవర్ స్టార్ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పిరియ‌డిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.ఒక పక్క రాజకీయాలతో.. మరో పక్క సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు పవన్. ఆయన నటిస్తోన్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు మేక‌ర్స్.నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర మల్లు’ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని జనవరి 6వ తేదీన ఉదయం 9:06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు..

తుఫానుకి ముందు ప్రశాంతతలా, యుద్ధానికి ముందు చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న యోధుడిలా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ పోస్టర్ లో ఆకట్టుకుంటోందిఇక ఆ పోస్టర్ లో ఉన్న మరో సర్ప్రైజ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పాటను పాడినట్టు అఫీషియల్ గా మేకర్స్ వెల్లడించారు. దర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసినా జ్యోతి కృష్ణ కచ్చితంగా క్రిష్ ఆలోచనలకు తగ్గట్లుగానే వీరమల్లు సినిమాను పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

బాక్సాఫీస్ ని షేక్ చేసే విధంగా హరిహర వీరమల్లు సినిమా ఉంటుందని, త్వరలోనే సినిమా నుంచి రాబోతున్న పాటతో ఆ విషయం తెలియడం కన్ఫార్మ్‌ అంటుంది చిత్ర బృందం.మరో వైపు వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ సైతం స్పీడ్‌గా సాగుతోంది. ఎక్కువ శాతం షాట్స్ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి చేసిన మేకర్స్‌ బ్యాలన్స్ వర్క్‌ని ఫిబ్రవరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రాబోతున్న మొదటి పాట సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు..