రాణా దగ్గుబాటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో అతను ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే.ఒకప్పుడు సినిమాలు మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఈ నటుడు ప్రస్తుతం కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది.అయితే నిర్మాతగా, మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్ గా,టాక్ షో కి పోస్ట్ గా చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు రాణా.
అయితే తన నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ లైనప్ చుస్తే షాక్ అవ్వాల్సిందే. చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల రానా దగ్గుబాటి షో అంటూ ఒక ప్రైమ్ వీడియో కి హోస్ట్ గా మారిపోయిన రాణా అదే షోలో తన సినిమాల గ్యాప్ కి కారణం చెప్పాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తనకి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో రాక్షస రాజు అనే ఒక సినిమా చేయాల్సి ఉంది.
కానీ కదా నేనే రాజు నేనే మంత్రి కి దగ్గరగా ఉండటంతో కథని మరింత డెవలప్ చేసే ప్రాసెస్ లో ఆ సినిమా కూడా లేట్ అవుతుంది. ఇక ఎప్పటినుంచో హిరణ్యకస్యప ప్రాజెక్ట్ చేయాలనేది అతని డ్రీమ్. అయితే అది మైథాలజికల్ సబ్జెక్టు కావడంతో దానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఆ సినిమా రావడానికి కూడా లేట్ అవుతుంది.
అయితే ఈ సినిమా త్రివిక్రమ్ పర్యవేక్షణలో డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. ఆ తర్వాత క్రిష్ ని డైరెక్టర్ గా తప్పించినట్లు తెలిసింది అయితే ఆ తర్వాత దాని గురించిన అప్డేట్ ఏది లేకపోవటం గమనార్హం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండాల్సింది కానీ అది కూడా త్రివిక్రమ్ బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతుంది. అయితే త్రివిక్రమ్ కాంబినేషన్లో తన సినిమా మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని కన్ఫామ్ చేశాడు రాణా. ఈ గ్యాప్ లోనే రాణా ద టాక్ షోలో హోస్ట్ గా కనిపిస్తూ సినీ సెలబ్రిటీలతో చిట్ చాట్ చేస్తున్నాడు. అంతేకాకుండా రాణా,వెంకటేష్ కలిసి చేస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా సెట్స్ మీద ఉంది.