యువరత్న బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 ఓ సంచలనం. అప్పట్లోనే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఒక విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైమ్ మెషీన్ అన్న కాన్సెప్టుతో హాలీవుడ్ ని తలదన్నే స్క్రీన్ ప్లేతో అద్భుతంగా తీసిన చిత్రమిది. ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు సింగీతం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ఎందుకనో ఓ పట్టాన కుదరలేదు.
ఎట్టకేలకు ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 కథ రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యతో కథా చర్చలు పూర్తయ్యాయన్నది లేటెస్ట్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనా వెలువడే ఛాన్సుందట. ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న బాలయ్య ఆదిత్య 999 చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తారని భావిస్తున్నారు. ఈనెల 10న బర్త్ డే రోజున ఆ విషయాన్ని ప్రకటిస్తారేమో చూడాలి.