బాల‌య్య ఏ స్ర్కిప్ట్ పూర్తిగా విన‌డా?

న‌ట‌సింహ బాల‌కృష్ణ లో ఫైరింగ్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ద‌గ్గ‌ర సౌమ్యంగా ఉండాలి. నెమ్మ‌దిగా మ‌సులుకోవాలి. ఆయ‌న చెప్పింది మాత్ర‌మే వినాలి. ఆయ‌న పూర్తిచేసిన త‌ర్వాత మిగ‌తా వారు మాట్లాడాలి. లేదండే ద‌బిడి దిబిడే. ఇది బాల‌య్య లో ఒక యాంగిల్. ఇక బాల‌య్య లో క‌నిపించని మ‌రో యాంగిల్ కూడా ఉంది. మ‌న‌స్త‌త్వం మాత్రం చాలా గొప్ప‌ది. స‌హాయం చేయ‌డంలో ముందుండే చేయి. ఏ విష‌యంలోనూ దాప‌రిక‌లుండ‌వు. ఉన్న విష‌యాన్ని ముక్కు సూటిగా మాట్లాడుతారు. ముక్కు సూడిగా అడుగుతారు. మ‌నిషి న‌చ్చాడంటే నెత్తిన పెట్టుకుంటారు.

న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ ఆ కాంపౌండ‌క లో కాలు కూడా పెట్ట‌లేడు. ఇది బాల‌య్య గురించి ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు చెప్పిన విష‌యాలు. అయితే మ‌నుషులు న‌చ్చినా…వాళ్ల లో ట్యాలెంట్ ఉంద‌ని బాల‌య్య గ్ర‌హించిన తొంద‌ర‌గా విడిచ‌పెట్ట‌ర‌ని డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ సారి బాల‌య్య తో ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో పైసా వ‌సూల్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే పూరి పై ఉన్న న‌మ్మ‌కంతో బాల‌య్య క‌నీసం స్ర్కిప్ట్ కూడా విన‌లేదు. డైరెక్ట్ గా షూటింగ్ అంటూ పూరి చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్ట‌గానే సెట్స్ కే వ‌చ్చేసారు మ‌హా అయితే బాల‌య్య 10 నిమిషాల క‌థ‌ను మాత్ర‌మే విని ఉంటార‌ని పూరి అన్నారు. అదీ బాల‌య్య అంటే!

అయితే సింహ సినిమా విడుద‌లై గురువారంతో ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ సినిమా గురించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. సింహా క‌థ‌ని బాల‌య్య కేవ‌లం 24 నిమిషాలు విని ఒకే చేసేసారు. బియ్యం ఉడికాయా లేదా? అని తెలియ‌డానికి గ‌రిట అన్నం తీయాల్సిన ప‌నిలేదు. ఒక మెతుకు తీసి చూస్తే చాలు..అదెంత వ‌ర‌కూ ఉడికిందో చెప్పొచ్చు అని! సింహా క‌థ లైన్ విని 24 నిమిషాల్లోనే లాక్ చేసేసారుట‌. అలాగే బాల‌య్యిలా లాక్ చేసిన క‌థ‌లు ఇంకా చాలానే ఉన్నాయిట‌. ఏ క‌థ ఆయ‌న పూర్తిగా వినర‌ని ద‌ర్శ‌కుడు! లైన్ పై క‌లిగే న‌మ్మ‌కంతో సినిమా ఒకే చేసేస్తార‌ని అంటున్నారు.