సినిమా వేరు, జీవితం వేరు. సినిమాలో ఆయన బాహుబలి. ప్రపంచరికార్డులు ఆయన సొంతం. అరివీర భయంకరుడు. భీకర యుద్ధాలు చేస్తారు. అయితే, జీవితంలో ఒక చిన పొరపాటు, చిన్నచిన్న రివెన్యూ అధికారుల కు భయపడేలా చేస్తుంది. బాహుబలి ప్రభాస్ పరిస్థితి ఇది. తన భూ సమస్యను తాను పరిష్కరించుకోలేక ఆయన ఇపుడు కోర్టు తలుపు తడుతున్నారు.
బాహుబలి ప్రబాస్ భూతగాదాలో ఇరుక్కుపోయారు. హీరో ఉప్పలపాటి సత్యనారాయణ ప్రభాస్ రాజు తనది అని చెబుతున్న భూమి ప్రభాస్ ది కాదని, అది ప్రభుత్వం భూమి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ భూమిలో ఆయన ఒక గెస్ట్ హైస్ కట్టుకున్నారు. రెవిన్యూ అధికారులు ఇపుడు ఈ భూమిలోకి ప్రవేశించి బాహుబలిని ఖాళీ చేయస్తున్నారు. తనను రెవిన్యూ అధికారులనుంచి కాపాడాలని ప్రభాస్ ఇపుడు హైకోర్టు ను ఆశ్రయించారు.
ఇంతకి జరిగిందేమిటంటే, ప్రభాస్ రాయదుర్గం పన్ముక్తా లో కొంత భూమి కొన్నాడు. ఈ భూమిని ఒక లాయర్ ఆయనకు విక్రయించారు. ఈ వ్యవహారమే మోసపూరితమమని శేరిలింగంపల్లె మాజీ తాహశీల్దార్ ఒకరు తెలుగురాజ్యం కు చెప్పారు. ఈ తాశీల్దార్ ఒక సారి ప్రభాస్ కొన్న భూమిలో వేసిన చిన్న చిన్నకట్టడాలను కూడా కూల్చేశారు కూడ. ఇపుడు ఈ జాగా లో ఉన్నగెస్ హౌస్ కు తాళం వేసి సీల్ చేశారు అధికారులు.
రాయదుర్గం పన్ముక్తాలో 5 , 46 సర్వే నంబర్లున్నాయి. ఇందులో 46 లోొ ఉన్న భూమి మొత్తం ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ 46 లో ఉన్న ప్రభుత్వ భూములను ఏదో విధంగా పెద్ద వాళ్లు కాజేయాలనుకుంటారుగా. తర్వాత రెగ్యులరైజ్ చేయించుకుంటారు. అదే జరిగింది. ఇలాంటి అక్రమాలలో పేరు మోసిన లాయర్, ప్రభాస్ ను రంగంలోకి దించి 46 సర్వే నెంబర్ లోని కొంత భూమిని సర్వే నెంబర్ లో 5 అని చూపి ప్రభాస్ కు విక్రయించారు.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలంలో,రాయ్ దుర్గ పన్ముక్త గ్రామంలోఉన్న 2083 చదరపు గజాల ఈ స్థలంలో ఆయన ఒక దర్జాగా ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించుకున్నారు. అయితే, ఈ మధ్య వచ్చిన ఒక హైకోర్టు అర్డర్ ప్రకారం సర్వే నెంబర్ 46 లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములని, ఆక్ర మణకు గురయిన భూములను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడం మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా శేరిలింగం పల్లి తాహశీల్దార్, రెవిన్యూ సిబ్బందిని వెంటబెట్టుకుని ప్రభాస్ భూములను కూడా స్వాదీనం చేసుకునేందుకు వెళ్లారు. ఇది ప్రభాస్ తప్పంటున్నారు. తానే వోనర్ ను అని, కోర్టు ఆర్డర్ తో నకు సంబంధం లేదని, తన తెలియకుండా ఉత్తర్వులీయడం ఎలా సబబు అని ఆయన అంటున్నారు.
ఇదే కోర్టు కు నివేదిస్తున్నారు. ప్రభాస్ తరఫు న్యాయవాది రుబాయినా ఖాటూన్ అధికారుల చర్యను తప్పుపడుతున్నారు. ఇలాంటి జరుగుకుండా ఉండేందుకు ప్రభాస్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (2014 డిసెంబర్) లోను, తెలంగాణ రాష్ట్రం (2015 జనవరి)లో కూడా రెగ్యలరైజేషన్ కోసం దరఖాస్తు చేశారని, ఇదింకా పెండింగులో ఉందని చెబుతున్నారు.
ప్రభాస్ కట్టిన టాక్స్ బిల్లులు,కరెంటు బిల్లు కూడా దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. ప్రభాస్ వంటి హీరో కూడా వివాదాస్పద భూమికొన్ని వివాదంలో చిక్కుకున్నారన్న అపకీర్తి రాకుండా ఉండేందు ప్రభాస్ న్యాయవాది గురువారం అర్జంట్ గా లంచ్ మోషన్ మువ్ చేస్తున్నారు.