ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ … సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

బాహుబ‌లి సినిమాతో అంత‌ర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఇప్పుడు భార‌త్‌ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2020 ప్రభాస్ అభిమానులతో పాటు చాలా మంది హీరోల ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. అందుకే 2021లో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ .. సలార్‌తో పాటు.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ వంటి సినిమాలను లైన్‌లో పెట్టాడు.

 బాహుబ‌లితో అంత‌ర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ఇప్పుడు భార‌త్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2020 ప్రభాస్ అభిమానులతో పాటు చాలా మంది హీరోల ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. అందుకే 2021లో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. (Twitter/Photo)

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవైపు కేజీఎఫ్ చాప్టర్ 2తో సంచలనాలకు సిద్ధమవుతున్న ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ ని అండర్ వరల్డ్ డాన్ గా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉండడంతో సలార్ పై మాస్ ఫ్యాన్స్ లో గొప్ప టాక్ నడుస్తోంది. అలాగే ట్రేడ్ లో బిజినెస్ పరంగానూ క్రేజు నెలకొంది.

ఇక ఈ క్రేజీ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. సలార్ బృందం ఆదివారం విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించినప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగింది. సమ్మర్ కానుకగా సలార్ ఏప్రిల్ 14న రిలీజ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా # సలార్ తిరుగుబాటు .. 2022 ఏప్రిల్ 14న. మేము వేడుకలు జరుపుకోవడానికి వేచి ఉండలేం… మీ అందరితో అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రభాస్ – శ్రుతి జంటపై కీలక చిత్రీకరణ సాగుతోంది. ఇప్పటికే లీకైన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.