వర్థమాన టీవీ నటుడు రాహుల్ దీక్షిత్ (28) సూసైడ్ చేసుకున్నారు. ఆయన నివాసం ఉంటున్న ముంబై అంధేరీ లో ఈ ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు చెప్పే వివరాల మేరకు, లోఖండ్ వాలాలోని తన ఇంట్లోనే రాహుల్ ఉరేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబీకులు వచ్చి చూసి, రాహుల్ ను కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు.
సంఘటనా స్థలిలో తమకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, రాహుల్ దీక్షిత్ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ద్రయాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
అయితే మరణానికి ముందు కొద్ది గంటల క్రితం రాత్రి రాహుల్ తన స్నేహితులతో పార్టీ చేసుకొంటున్నట్టు తన ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్టీలో గానీ, పార్టీ తర్వాత ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇక రాహుల్ తండ్రి మహేష్ దీక్షిత్ తన ఫేస్ బుక్ ఖాతాలో ‘ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్లిపోయావు రాహుల్’ అని కామెంట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది