అపరిచితుడు,శివపుత్రుడు వంటి చిత్రాలతో తెలుగువారి మనస్సులో ముద్ర వేసుకున్న హీరో విక్రమ్. వరస పెట్టి పరాజయాలు ఎదుర్కొంటున్న విక్రమ్ ఇప్పుడు తు కుమారుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. అందుకోసం సేఫ్ జోన్ లో ఉంటుందని, తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ని ఎంచుకున్నాడు.
తొలుత ‘వర్మ’ టైటిల్‌తో ఈ రీమేక్‌ను బాలా దర్శకత్వంలో రూపొందినా.. తర్వాత కొన్ని కారణాల వల్ల టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా మార్చారు. బాలా డైరక్ట్ చేసిన సినిమాని ఫైనల్ కాపీ చూసి ఆయన్ని తప్పించారు. తెలుగు ఒరిజనల్ వెర్షన్ కు తమిళ రీమేక్‌కు చాలా తేడా ఉందన్న కారణంగా నిర్మాతలు సినిమాను రీ షూట్ చేశారు. దర్శకుడు బాలా సినిమాను నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని గిరీశాయా అనే నూతన దర్శకుడు తీసుకున్నారు.
ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ధృవ్ తన నటనతో ఆకట్టుకున్నారు కానీ పూర్తి జెరాక్స్ కాపీలా సాగింది. ఇక టీజర్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని గుర్తు చేసింది.విజయ్ దేవరకొండను మ్యాచ్ చేయడానికి ఈ సినిమా యూనిట్ బాగా కష్టపడ్డారు. అయితే ధృవ్ గొంతు మాత్రం చాలా గంభీరంగానే ఉండటం ప్లస్ అయ్యింది.
తెలుగులో వివాదాస్పదమైన బూతు తిట్టు, లిప్ లాక్‌లను తమిళ టీజర్‌లోనూ పొందుపరిచారు. ఇంత జెరాక్స్ కాపీ సినిమా తీసే బదులు డబ్బింగ్ చేసి వదిలితే సరిపోయేదిగా అని అంతటా వినిపిస్తోంది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధన్ సంగీతం అందిస్తున్నారు. ప్రీతి పాత్రను నటి బనితా సంధు పోషిస్తున్నారు. ప్రియా ఆనంద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.