‘అరవింద సమేత’ కథకి ఆ సినిమా ప్రేరణా?

ఇప్పుడు ఎక్కడ విన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్  తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’గురించిన కబుర్లే.  పాటల సందడి మొదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ లేపుతోంది. ఇప్పటికే విడుదలై పాటలు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. తమన్ సంగీత సారధ్యం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడుకి కలగటం సహజం.

దాంతో ఈ సినిమా కథ గురించి స్పెక్యులేషన్స్ మీడియాలో మొదలయ్యాయి. అయితే కొందరు మాత్రం ఈ కథ ప్రభాస్ నటించిన మిర్చికు దగ్గరగా ఉంటుందంటూ ప్రచారం మొదలెట్టారు. 2013లో వచ్చి సూపర్ హిట్ అయిన మిర్చి తరహాలోనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో
జరిగే ఓ క్లాసికల్ స్టోరీ అంటున్నారు. అయితే త్రివిక్రమ్ తరహా మ్యాజిక్ తో సాగుతుందని చెప్తున్నారు.

ఇక  రెండు రోజుల క్రితం విడుదలైన పెనిమిటి సాంగ్ తో ఎక్సపెక్టేషన్స్ రెట్టింపు అయ్యాయి.  ఈ సాంగ్ తో గుండెల్ని పిండేశాడు.  ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు తప్పకుండా కంటతడి పెట్టుకోవాల్సిందే అన్నట్లు సాగింది.  లిరిక్స్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా  దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.