కేక: ‘ఆక్వామ్యాన్’ బిహైండ్‌ ది సీన్స్‌ (వీడియో)

సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్.. ఇలా ఎన్నో విచిత్రమైన పాత్రలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ ఇప్పుడు ‘ఆక్వామ్యాన్’ని మన మందుకు తెస్తోంది. సగం మనిషిగా.. సగం చేపగా ఉండే చిత్రమైన క్యారెక్టర్ గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘ఆక్వామ్యాన్’ కు సంభందించి ‘బిహైండ్‌ ది సీన్స్‌’అంటూ ఓ మేకింగ్ వీడియోని వదిలారు నిర్మాతలు. సూపర్ హీరో సినిమాల్ని అమితంగా ఇష్టపడే సినీ ప్రియులకు ఈ మేకింగ్ వీడియో తెగ నచ్చేస్తోంది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

AQUAMAN – Behind the Scenes – Now Playing In Theaters

ఆంబర్‌ హర్డ్‌, పాట్రిక్‌ విల్సన్‌, నికోల్‌ కిడ్మన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో విశేషాలకు సంభందించి క్లూలు ఇస్తోంది ఈ వీడియో . ఈ ‘బిహైండ్‌ ది సీన్స్‌’ వీడియోలో ఆక్వామన్‌ పాత్రను ఎలా రూపొందించారో చూపించారు. ఈ సినిమా కోసం ఓ ప్రపంచాన్నే సృష్టించారని దర్శకుడు జేమ్స్‌ తెలిపారు.

అలాగే ఇలాంటి సినిమాను ఇంతకు ముందు ఎప్పుడూ ప్రేక్షకులు చూసి ఉండరని అంటున్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. 160 మిలియన్‌ డాలర్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మించే ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్.. శాండియాగో కామిక్ కాన్ సంస్థ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది డిసెంబరు 21న ‘ఆక్వామన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.