టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించదు. మిగతా వారిలా ఎక్కువ యాక్టివ్‌గా ఉండదు. అవసరమైనప్పునడు మాత్రమే అలా రియాక్ట్ అవుతుంది. బయటి ఫంక్షన్లలోనూ అనుష్క ఎక్కువగా కనిపించదు. అనుష్కను తెరపైనే తప్పా బయటి ఈవెంట్లలో చూడటం అనేది ఎక్కువగా కుదరదు. ఎక్కువగా పబ్లిక్‌లో ఉండటం, పబ్లిసిటీ చేయించుకోవడం అనుష్కకు అంతగా నచ్చదు.
ఆ మధ్యఓ సారి రాజమండ్రిలోనూ ఓ గుడికి వెళ్లిన సమయంలోనూ సాధారణ మహిళగానే వెళ్లింది. స్టార్ హీరోయిన్ కదా అని హంగూ అర్భాటాలతో వెళ్లలేదు. ఎవ్వరికీ తెలియకుండా వెళ్లింది వచ్చేసింది. అలా ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేస్తుంటుంది అనుష్క. అలాంటి అనుష్క తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొంది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జీఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ‘షీ పాహి’ అనే మహిళల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమంలో అనుష్క ముఖ్య అతిథిగా పాల్గొంది.
ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్ అని అనుష్క చెప్పుకొచ్చింది. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారని ప్రశంసించింది. తనరె ఇలాంటి కార్యక్రమంకు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇంత మంది మహిళా పోలీస్‌లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని… ‘షీ పాహి’ అనే పేరు పెట్టడం చాలా బాగుందంటూ కొనియాడింది. సమాజం లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని అనుష్క సూచించింది.