అనుష్క వంటి సెలబ్రెటీ సోషల్ మీడియాలో ఒక్క ఫొటో పెట్టినా ఎంత రచ్చ జరుగుతోందో ఈ రోజు జనాలకు అర్దమైంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనుష్క ఓ ఫొటో పోస్ట్ చేసారు. ఆ ఫొటో గురించి ఆమె ఏమీ రాయలేదు. దాంతో ఆ ఫొటో ఆమె అభిమానుల్లో ఎన్నో సందేహాలకు దారితీస్తోంది. ఎక్కడ చూసినా ఆ ఫొటో గురించే చర్చ జరుగుతోంది.
అనుష్క తన కాలి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్న ఫొటో అదే. దీనికి ‘క్యాప్షన్ అవసరం’ లేదంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ అంతా ‘త్వరలో పెళ్లి చేసుకోబోతోందా..సింబాలిక్ గా ఈ ఫొటో పెట్టిందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోకు ఇప్పటికే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.
ఇదేనా ఆ నిజం
చిత్రంగా వేరే ఆలోచన లేకుండా నెటిజన్లు ఎక్కువగా ఆమె పెళ్లి గురించే కామెంట్లు పెడుతూండటం విశేషం. కానీ అనుష్క మాత్రం ఈ కామెంట్స్‌పై స్పందించలేదు. అయితే ప్రస్తుతం అనుష్క బరువు తగ్గే పనిలో నాచురోపతి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట. దానికి సంభందించిన ఫోటో కూడా అయ్యిండవచ్చు అనేది కొందరి సినిమావాళ్ల భావన.
ఆఖరిగా ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క తన తదుపరి చిత్రం గురించి ఇంకా ప్రకటించలేదు. ఆమె తమిళంలో మాధవన్‌తో కలిసి ఓ చిత్రంలో కమిటైందని తమిళ సినీ వర్గాల సమాచారం. మరో ప్రక్క తెలుగులో నానితో కలిసి సినిమా చేయబోతున్నారన్న టాక్ కూడా వినపడుతోంది.