‘అంతరిక్షం’ట్రైలర్ :కొత్తగా ఉందా..హాలీవుడ్ కాపీలా ఉందా?

‘ఘాజీ’ చిత్రంతో ఘన విజయం సాధించిన సంకల్ప్‌రెడ్డి మరోసారి ఓ కొత్త తరహా చిత్రంతో రాబోతున్నారు. ఈసారి అనంత విశ్వంలో జరిగే అద్భుతాల్ని ‘అంతరిక్షం’లో ఆవిష్కరించబోతున్నాడు. వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘అంతరిక్షం’. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు మొద‌లు పెట్టారు మేక‌ర్స్‌. తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ విడుద‌ల చేశారు. ఇందులో సీన్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

ఈ ట్రైలర్ చూస్తూంటే హాలీవుడ్ లో వచ్చిన కొన్ని చిత్రాలు గుర్తు వచ్చినా, ఖచ్చితంగా మన సినిమా కీర్తి ప్రతిష్టలను పెంచేలా ఉంటుందని అర్దమవుతోంది. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు అన్ని దాదాపు ఒకేలా ఉండటమే ..సిమిలాటీస్ కనపడటానికి కారణం అని విశ్లేషకులు చెప్తున్నారు.

లావ‌ణ్య‌ త్రిపాఠి, అధితి రావు హైద‌రీ హీరోయిన్స్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ట్యాగ్ లైన్ 9000 కెఎంపిహెచ్ . ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌‌గా ఈ చిత్రంలోని సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌‌పై చిత్రీకరిస్తున్నారు.

Antariksham 9000 KMPH Theatrical Trailer | Varun Tej, Aditi Rao, Lavanya Tripathi | Sankalp Reddy

హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘అంతరిక్షం’ ఉండబోతుందని ఈ ట్రైలర్ ని చూస్తే అర్దమవుతోంది. జీరో డార్క్, గేమ్ ఆప్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం మరో విశేషం.

దేవ్ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా, రియా పాత్ర‌లో అదితి రావు హైద‌రి, పార్వ‌తి పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌నుంది. ప్రశాంత్ ఆర్. విహారి చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు