అనిల్ రావిపూడి ఇంతవరకు తీసిన నాలుగు సినిమాలు పటాస్ ,సుప్రీమ్,రాజాదిగ్రేట్ ,ఎఫ్2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంతవరకూ అనిల్ రావిపూడి కి అపజయం తెలీదు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ తో అనిల్ రావిపూడి కూడా రాజమౌళి సరసన చేరి సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటారు. రాజమౌళి కన్నా అనిల్ రావిపూడి సినిమాని త్వరితగతిన పూర్తి చేస్తారని అభినందనలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో చిన్న ప్రశంసతో పాటు విమర్శ కూడా ఉంది. అనిల్ చిత్రాలు హిట్ అయితే అవుతున్నాయి కానీ ఆయన తీసుకునే కథల్లో పెద్దగా బలం అయితే ఉండడం లేదు. ఏదో కామెడీ చేస్తూ… హీరో హీరోయిన్లకి కొన్ని మ్యానరిజమ్స్ పెడుతూ అలా కొట్టుకెళ్ళిపోతున్నారనిపిస్తుంది. అలాగని ఎంత కాలం ప్రేక్షకులకు కూడా కొన్ని కొన్ని సార్లు విసుగు వస్తది. మంచి కథ కథనాల కోసం చూసే ప్రేక్షకులకు ఒకటి రెండు సార్లు కంటే ఇలాంటి చిత్రాలను ఇష్టపడరు.
ఇక ఈ రోజు విడుదలైన సరిలేరు చిత్రం అసలు ఏ మాత్రం బలమైన కథ లేదు. బలమైన కథ కాదు కదా.. కనీసం ఓ మోస్తరు కథ కూడా లేదు.. నూట అరవై నిమిషాల సినిమాలో చివరి ముప్ఫై నిమిషాల సినిమా మిగిలి ఉండగా కూడా అసలు కథ ఏంటి.. ఈ సినిమా అంతా ఎందుకు నడుస్తుంది అన్నది తెలియదు. ఫస్టాఫ్ వరకు ఓ ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో లాగించేసినా సెకండాఫ్‌లో కథ, కథనాల రివీల్ చేసే టైంలో మాత్రం తేలిపోయాడు. అన్నిసార్లు కథ లేకుండా చేస్తే సినిమా వర్కవుట్ కాదన్న విషయం సరిలేరుతో ఫ్రూవ్ అయ్యింది. ప్రతిసారి ఏదో కామెడి, మ్యానరిజమ్స్‌తో కొట్టుకుపోదాం అని చూస్తే అది ఎంత వరకు ఓకే అవుతుంది అన్నది ఈ చిత్రంతో తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం హ్యాపీగా సాగే ఈ చిత్రం సెకండాఫ్ కాస్త స్లో అయిందనే చెప్పాలి. మరీ పూర్తిగా కథ లేకుండా ఏదో కామెడీ మంచి రిచెస్ట్ కాస్ట్ అండ్‌క్రూతో త్రూ అవుట్ సినిమాని లాగించేద్దామని చూస్తే అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుద్ది అన్నది అనిల్ తెలుసుకోలేకపోతున్నాడా.