బిగ్ అప్డేట్ : “భగవంత్ కేసరి” ట్రైలర్ జాతరకు డేట్ ఖరారు 

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటించిన తాజా చిత్రమే “భగవంత్ కేసరి” అని అందరికీ తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సాలిడ్ ఏక్షన్ డ్రామా నందమూరి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొల్పింది.

ఇప్పటికే దసరా బరిలో ఫిక్స్ అయ్యిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలుస్తుంది అని అంతా అనుకుంటూ ఉండగా నిన్ననే ఈ సినిమా నుంచి ఓ సూపర్ ఎమోషనల్ సాంగ్ ని కూడా మేకర్స్ రిలీస్ చేశారు. ఇక ఈ సాంగ్ అనంతరం అయితే ఈరోజు బిగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు అందించారు.

కాగా ఈ అప్డేట్ తో అయితే భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఫిక్స్ అయ్యిపోయింది. దీనితో ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ ఈ అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా బాలయ్యపై ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి తెలిపారు. దీనితో ఆరోజు నుంచి బాలయ్య భగవంత్ కేసరి మాస్ జాతర స్టార్ట్ కానుంది అని చెప్పాలి.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 
https://x.com/Shine_Screens/status/1709887812840087818?s=20