బాక్సాఫీస్ : “భగవంత్ కేసరి” 2 డేస్ వసూళ్ల డీటెయిల్స్.!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అయితే టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఓ మాస్ అండ్ ఎమోషనల్ ధరల “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

అయితే బాలయ్య రెండు వరుస హిట్స్ అందుకున్నప్పటికీ మరీ అంత భారీ మార్జిన్ గ్యాప్ వసూళ్లు రాలేదు కానీ అలాగని మరీ తక్కువ కూడా రాలేదు. ఓకే పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరి ఈ చిత్రం వసూళ్లు ఇపుడు రెండో రోజుకి చేరుజోవడంతో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని భగవంత్ కేసరి టచ్ చేసేసింది.

ఇక మెయిన్ గా ముఖ్య ఏరియాల బ్రేక్ డౌన్ చూసినట్టు అయితే ఈ చిత్రం నైజాం లో 3.52 కోట్లు అలాగే టోటల్ ఏపీలో 6.39 కోట్లు అందుకోగా రెండో రోజు ఈ చిత్రం 9.91 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక తెలుగు స్టేట్స్ లో 20 కోట్ల మేర షేర్ ని టచ్ చేస్తున్న ఈ చిత్రం.

ఈ రెండు ర్పజుల్లో 51.12 కోట్ల గ్రాస్ ని అందుకొని రెండు రోజుల్లో 23 కోట్లకి పైగా షేర్ ని అందుకుంది. దీనితో భగవంత్ కేసరి ఓకే పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఆడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.