మెగాస్టార్, దిల్ రాజు..ఓ అపజయం ఎరుగని దర్శకుడు..?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా మళ్ళీ ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని డెలివర్ చేసి అయితే చాలా కాలమే అయ్యింది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు వచ్చినా అవి కొన్ని అంత గట్టిగా రాణించలేదు కూడా దీనితో ఇప్పుడు తెరకెక్కుతున్న మాసివ్ ప్రాజెక్ట్ లపైనే అభిమానులు అయితే అంచనాలు పెట్టుకున్నారు.

కాగా ఈ చిత్రాల్లో అయితే సీనియర్ స్టార్ హీరోస్ సినిమాలు కూడా ఉండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలు కూడా ఒకటి. అయితే మెగాస్టార్ భారీ కం  అనుకుంటే మళ్ళీ దానిని నుంచి వెనక్కి వెళ్ళిపోడానికి ఎంతో సమయం కూడా తీసుకోలేదు. కాగా ఇప్పుడు నుంచి మాత్రం చిరు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుండగా సినిమాలే చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం ప్రకారం బాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనుండగా టాలీవుడ్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో ఏది కూడా ప్లాప్ లేకుండా ఉన్న దర్శకుల్లో రాజమౌళి ఆ తరవాత అనీల్ రావిపూడి కూడా ఒకడు.

అలా ఇప్పుడు అనీల్ రావిపూడితో అయితే చిరు తన తదుపరి సినిమా చేయనున్నారని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా లాస్ట్ స్టేజ్ చర్చల్లో ఉండగా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేశారనే తెలుస్తుంది. మరి ఈ అవైటెడ్ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.