ఫైనల్ గా “భగవంత్ కేసరి” జర్నీ పూర్తి..!

టాలీవుడ్ నుంచి వచ్చే దసరా బ్లాస్ట్ గా రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. కాగా తెలుగు స్టేట్స్ లో అయితే ఈ ఏడాది మొదటి హిట్స్ లో ఒకటిగా నిలిచిన బాలయ్య మాస్ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి” ఒకటి కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేసిన సినిమానే “భగవంత్ కేసరి”.

దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తున్న మొదటి సినిమాగా ఇది కాగా బాలయ్య కెరీర్ లో 108వ సినిమా ఇది. అయితే దీనిపై సాలిడ్ బజ్ ఆల్రెడీ నెలకొనగా మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఈ అక్టోబర్ 19న తీసుకు రావడానికి ట్రై చేస్తున్నారు.

మరి ఈ సినిమా ఆల్రెడీ ఫైనల్ స్టేజి ఆఫ్ షూట్ కి రాగ లేటెస్ట్ గా సినిమా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా ఫైనల్ అప్డేట్ అందించారు. దీనితో భగవంత్ కేసరి జర్నీ పూర్తయ్యింది అంటూ ఓ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో కూడా బాలయ్య పై సినిమా నుంచి విడుదల చేశారు.

దీనితో ఇది వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రంలో కాజల్ అగ్గార్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా జస్ట్ తెలుగులో మాత్రమే ఈ సినిమా రాబోతుంది.
https://x.com/Shine_Screens/status/1707343098924388562?s=20