టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి చేసిన ఉద్యమం పెద్ద దుమారం రేపింది. టాలీవుడ్ లో పలువురి ప్రముఖుల గురించి వెల్లడిస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ వివాదంతో ఒకడుగు వెనక్కి వేసింది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న శ్రీరెడ్డి అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంపై పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంపై సీబీఐ, ఆంధ్రా, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జరీ చేసింది హైకోర్టు.
నటి శ్రీరెడ్డి తరపున కాస్టిగ్ కౌచ్ వివాదంపై గోపాలకృష్ణ కళానిధి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం తెలంగాణ, ఆంధ్రా డీజీపీలతో పాటు సీబీఐకి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. శ్రీరెడ్డి చాలాసార్లు నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. దీంతో శ్రీరెడ్డి పోరాటానికి కొంతమేర బలం వచ్చిందనే చెప్పాలి.
శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర లేపినప్పుడు మహిళా సంఘాలు, పలువురు ఆర్టిస్టులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే రాంగోపాల్ వర్మ చెప్పాడని పవన్ కళ్యాణ్ ని తిట్టనంటూ ఆమె మాట్లాడిన కాల్ రికార్డు బయటకు రావడంతో అప్పటివరకు తనతో ఉన్నవారంతా ఆమెను దూరం పెట్టేశారు. మీడియా చానెల్స్ కూడా శ్రీరెడ్డి చుట్టూ తిరగటం తగ్గించేశాయి. అంతటితో శ్రీరెడ్డి కూడా సర్దుమణిగి చెన్నై వెళ్ళిపోయింది. అక్కడ కూడా లీక్స్ చేస్తూ తమిళ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది.