అఖిల్ టాట్టూతో ఎవరీ వయ్యారి యాంకర్!
యువ సామ్రాట్ నాగార్జునకు గాళ్స్ లో ఎలాంటి పాలోయింగ్ ఉండేదో చెప్పాల్సిన పనే లేదు. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా నాగార్జునపై మనసు పారేసుకోని అమ్మాయి ఉండేది కాదు. యువ సామ్రాట్ నుంచి హలో బ్రదర్ గా కింగ్ గా ఎదిగాకా ఆయన్ని మగువలు వదిలిపెట్టడం లేదు. ఆయన వారసత్వాన్ని నాగచైతన్య- అఖిల్ అందిపుచ్చుకున్నా కింగ్ రేంజ్ అయితే కాదు. ఇక ఇప్పటికే నాగచైతన్యను సమంత లాక్ చేసేసింది కాబట్టి అఖిల్ పైనే అమ్మాయిల కళ్లన్నీ. అతడు దొరికితే ఎత్తుకెళ్లేంత కసిగా ఉన్న అమ్మాయిలకు కొదవేమీ లేదు.
తాజాగా ఓ యాంకరమ్మ అఖిల్ పై ఉన్న కసిని బయటపెట్టేయడంతో కింగ్ నాగార్జున ఖంగు తినాల్సిన పరిస్థితి వచ్చింది మరి. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే ఖచ్చితంగా అఖిల్ కావాలని కోరుకుంటా అంటూ తన శరీరంపై వేసుకున్న పచ్చబొట్టుని చూపించింది ఆ అమ్మడు. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. యాంకర్ విష్ణు ప్రియ. లవ్ యు జిందగీ షోలో ఈ స్పెషల్ ఎపిసోడ్ రక్తి కట్టించింది. ఝాన్సీ యాంకరింగ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా నాలుగో ఎపిసోడ్ లో శ్రీముఖి- విష్ణు ప్రియ రచ్చ రచ్చ చేశారు. అక్కడ విష్ణుప్రియ సీక్రెట్ ని యాంకర్ శ్రీముఖి బయటపెట్టేసింది. అఖిల్ అంటే పిచ్చి గజ్జి ఉన్న యాంకర్ అంటూ విష్ణు ప్రియ గుట్టు లీక్ చేసింది. ఇక విష్ణు ప్రియ సైతం ఝాన్సీ ముందు హొయలు పోతూ అఖిల్ టాట్టూని రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆ ఎపిసోడ్ కి యూట్యూబ్ లో మైలేజ్ దక్కింది.
అన్నట్టు ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్ ని ప్రేమించిన అఖిల్ పెళ్లాడేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత అఖిల్ సోలో బ్యాచిలర్ గానే ఉన్నాడు. ప్రస్తుతం అతడి గురించి కలలు కంటున్న గాళ్స్ పెళ్లాడేయాలన్న ఆసక్తిని కనబరుస్తుండడం చూస్తుంటే ఇక నాగార్జున తొందర పడాల్సిన టైమ్ వచ్చేసినట్టేనన్నమాట.