పొద్దున్నే అనసూయ ‘ఆంటీ’ గోల..తనని ఇలా మాత్రమే పిలవాలి అట.!

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక అంశం అలా ట్రెండింగ్ గా నడుస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలా మన టాలీవుడ్ లో అయితే ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ గా ప్రముఖ యాంకర్ అనసూయ చేస్తున్న సోషల్ మీడియా పోరాటం మారింది.

తాను ఏ ఉద్దేశంతో చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో నిన్న స్టార్ట్ చేసిన ఆమె ‘ఆంటీ’ వార్ నిన్నటితో ఆగింది అనుకుంటే ఇప్పుడు ఈరోజు తెల్లవారు తోనే మళ్ళీ స్టార్ట్ చేసేసింది. దీనితో ఆల్రెడీ ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఆంటీ ట్యాగ్ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడంలేదు.

తనని ఎవరూ ఆంటీ అనడానికి వీల్లేదని ఇలా అనే హక్కు ఎవరికైనా తమ ఇంట్లో వాళ్ళకే ఉంటుంది అని బయట వాళ్ళు ఎవరు కూడా ఎవరినీ ఇలా పిలవకూడదు అని అంటుంది. మరి తనని ఎవరైనా పిలవాలి అనుకుంటే కేవలం..

మిస్ అనసూయ అని కానీ లేదా అనసూయ గారు అని మాత్రమే పిలవాలి అని తనని అనసూయ ఆంటీ అని పిలిచే హక్కు మాత్రం ఇంకెవరికి లేదని తాను చెప్పేసింది. దీనితో నిన్నటి నుంచి మాత్రం ఈ అనసూయ పేరు, ‘ఆంటీ’ సోషల్ మీడియాలో అలా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.