అంబరీష్ వీడియో లీక్…చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ గుండెపోటుతో శనివారం రాత్రి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన చివరి చిత్రం ‘కురుక్షేత్ర’. కన్నడలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో అంబరీష్ భీష్ముడు పాత్రను పోషించారు. రీసెంట్ గా ఆ చిత్రంలో అంబరీష్ పాత్రకు సంబంధించిన వీడియో లీక్‌ అయ్యింది. దాదాపు 20 సెకన్లు ఉన్న ఈ వీడియోలో భీష్ముడు కన్నుమూయడానికి ముందు సీన్ ఉంది. అంబరీష్ అంపశయ్యపై పడుకుని మరణం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ వీడియో ని అంబరీష్ మృతి తర్వాత లీక్ అవటంతో దీన్ని చూసిన అంబరీష్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ లీక్ వీడియోకు కనెక్ట్ అయ్యిపోతున్నారు. అయితే ఇరవై సెకన్లు వీడియోనే కావటంతో ‘కురుక్షేత్ర’టీమ్ కూడా దీనిపై యాక్షన్ తీసుకునేటట్టు కనపడటం లేదు. ఏదైమైనా కరెక్ట్గ్ గా ఆయన మరణ వార్తకు సింక్ అయ్యేలా..వీడియోని లీక్ చేసిన వారు ఖచ్చితంగా ఆయన వీరాభిమానులే అయ్యింటారు అంటున్నారు సినిమావాళ్లు.

ఇక ‘కురుక్షేత్ర’ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూష్ వల్ల విడుదలను వాయిదా వేశారు. నాగన్న ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శన్‌‌, అర్జున్‌, స్నేహ, మునిరత్న నాయుడు, వి. రవిచంద్రన్‌, మేఘనా రాజ్‌, నిఖిల్‌ గౌడ, పవిత్ర లోకేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అంబరీష్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే కొన్ని బయటికి వచ్చాయి.