అమర్ అక్బర్ ఆంథోనీ … బిజినెస్ తెలుసా ?

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ , ఇలియానా  జంటగా నటించిన “అమర్ అక్బర్ ఆంథోనీ ” సినిమా  శుక్రవారం విడుదలకాబోతుంది . మైత్రీ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాపై అటు శ్రీను వైట్ల , ఇటు రవితేజ ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది . ఎందుకంటే ఇద్దరు విజయం కోసం  ఎదురు చూస్తున్నారు . అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఆంధ్ర ,తెలంగాణలో  22 కోట్ల వ్యాపారం చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం .
ఆంధ్ర ప్రాంతంలో 9 కోట్లు, తెలంగాణాలో 9 కోట్లు , సీడెడ్ లో 4 కోట్లు  వసూలయ్యాయట .

ఇక కర్ణాటక, తమిళ నాడు , అమెరికాలో 5 కోట్ల వరకు వ్యాపారం చేసినట్టు చెబుతున్నారు . “అమర్ అక్బర్ ఆంథోనీ ”  సినిమా ఘానా విజయ సాధిస్తుందని రవితేజ ఆత్మ  విశ్వాసంతో వున్నాడు . దర్శకుడు శ్రీను వైట్ల  ఈ సినిమా తనని నిలబడుతుందని  నమ్ముతున్నాడు . రేపు ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి . రవి తేజ , శ్రీను  వైట్ల  నమ్మకం  నిజమవుతుందో కాదో రేపటిదాకా వేచి ఉందాల్చిందే .!