తమిళ ‘జెర్సీ’ లో హీరోయిన్ అమల పాల్

హీరోయిన్ అమల పాల్ ఈ మధ్య హీరోయిన్ ఆధారిత సినిమాల పైనే దృష్టి పెట్టిందని చెప్పాలి. చెప్పడమే కాదు అలాంటివే చేస్తానని తేల్చి చెప్పింది కూడా. ప్రస్తుతం ఈమె నాని ‘జెర్సీ’ సినిమా తమిళ రీమేక్ లో హీరోయిన్ గా సంతకం చేసిందట. ఈ సినిమాని తమిళంలో రానా దగ్గుబాటి రీమేక్ చేయనున్నారు.

ఈ సినిమాలో హీరో గా అంటే మన నాని పాత్రను హీరో విష్ణు విశాల్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగులో నాని సరసన చేసిన శ్రద్ధ శ్రీనాధ్ కి ఈ సినిమాతో మంచి పేరే వచ్చింది. ఇప్పుడు అమల కూడా తమిళంలో నటించి పేరు తెచ్చుకుంటుందన్నమాట. ఇప్పటికే అమల పాల్, విష్ణు విశాల్ జంటగా ‘రచ్చసం’ అనే తమిళ సినిమాలో నటించి హిట్ కొట్టారు.