నానిపై ఇంత అక్కసు తగునా??

టాలీవుడ్ సినిమా దగ్గర తమ స్వయం కృషితో తమకి తాము దారి వేసుకుని హీరోలుగా ఎదిగిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకడు. మరి నాని ఇన్నేళ్ల కెరీర్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమా దగ్గర తన సహజ నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదుని తాను సొంతం చేసుకున్నాడు.

అయితే పేరుకే నేచురల్ స్టార్ కానీ నాని నటనకి సంబంధించి అసలు ఒక్క నేషనల్ అవార్డు కూడా లేదు. గతంలోనే తన ఎమోషనల్ క్లాసిక్ హిట్ చిత్రం “జెర్సీ” విషయంలో చాలా అన్యాయం జరిగింది అని మూవీ లవర్స్ అంటారు. ఇక ఇప్పుడు కూడా వచ్చిన నేషనల్ అవార్డ్స్ లో తన సినిమాకి చోటు దక్కకపోయినా..

నాని తన అభిప్రాయం ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానిని కూడా కొందరు రాద్ధాంతం చేయడం బాధాకరం.. బెస్ట్ చిత్రాల్లో తమిళ్ నుంచి “జై భీమ్” కి అవార్డు రాకపోవడంతో నాని బాధపడుతున్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనితో నాని పై తెలుగు ఆడియెన్స్ నే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు.

నాని అటెన్షన్ కోసం చేస్తున్నాడు అని తన సినిమాకి ఎప్పుడు రాలేదు అని తమిళ్ చిత్రానికి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ చాలా మంది అంటున్నారు. అయితే ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అంటే నేషనల్ అవార్డు సాధించడానికి జై భీమ్ లో అన్ని అర్హతలూ ఉన్నాయి ఇది వాస్తవం అలాంటప్పుడు నాని చేసిన పోస్ట్ లో ఏమంత తప్పు కనిపించిందో అర్ధం కావట్లేదు. మరి ఇది నాని పై కేవలం అక్కసు కాకపోతే ఇంకేంటి?