నష్టాల కామెంట్స్ పై వెంటనే రియాక్ట్ అయ్యిన నాని నిర్మాతలు.!

Shyam Singha Roy

టాలీవుడ్ సినిమా దగ్గర టైర్ 2 హీరోస్ లో ఇప్పుడు అయితే టాప్ 1 హీరో అని చెప్పొచ్చు నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. మరి నాని హీరోగా నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న” సినిమా రిలీజ్ కి రాబోతుంది అలాగే మరో పక్క ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఈరోజు టీజర్ ని రిలీజ్ చేసి డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

అయితే ఈ లాంచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో నాని సినిమాలపై ఓ ప్రస్తావన రాగా తాను మంచి సినిమాలు తీస్తున్నప్పటికీ నష్టాలే వస్తున్నాయి అనే ప్రశ్నలు ఎదురు కాగా దానిని నాని స్టేజి పైనే ధీటైన సమాధానం ఇచ్చాడు. మేము పది రూపాయలు పెట్టి సినిమా చేస్తే అది 50 రూపాయలు అన్ని అంశాల్లో కలిపి రాబట్టింది అని నాని తెలిపాడు.

అయితే ఈ క్రమంలోనే నానికి సపోర్ట్ గా ఆ కామెంట్స్ కి సమాధానంగా అయితే తనతో వర్క్ చేసిన నిర్మాతలు “జెర్సీ” నాగవంశీ అలాగే “శ్యామ్ సింగ రాయ్” నిర్మాత వెంకట్ బోయినపల్లి గట్టి సమాధానం ఇచ్చారు. నానితో తాము చేసిన చిత్రాలు చాలా ప్రాఫిటబుల్ మాత్రమే కాకుండా ఆ చిత్రాలు తమకి ఎంతో స్పెషల్ అని నాగవంశీ చెప్పగా నొక్కి చెప్పారు.

అలాగే శ్యామ్ సింగ రాయ్ తమకి ఎంతో ప్రత్యేక చిత్రం అది కొత్త అడుగులు వేయించింది. ఒకవేళ అవకాశం వస్తే మళ్ళీ నాని తో సినిమాలు చేయడానికి ఎప్పుడైనా రెడీ అంటూ శ్యామ్ రాజు సింగ రాయ్ నిర్మాత తెలిపాడు. దీనితో ఆ కామెంట్స్ పై వీరు వెంటనే స్పందించడం నానికి ప్లస్ అవ్వడమే కాకుండా తనపై వచ్చిన కామెంట్స్ కి గట్టి సమాధానంగా నిలిచాయి అని చెప్పాలి.