విజయ్ దేవరకొండ కోసం ఎవరొస్తున్నారు.?

విజయ్ దేవరకొండ – శ్రీలీల జంటగా తాజా చిత్రం ఇటీవలే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలతో పాటూ ఇంకో హీరోయిన్‌కీ ఛాన్స్ వుందట. ఆ హీరోయిన్ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోందట.

అయితే, ఆ హీరోయిన్‌కి సంబంధించి స్పెషల్ రోలా.? స్పెషల్ సాంగా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, ఓ స్టార్ హీరోయిన్‌ని ఈ రోల్ కోసం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట.

సౌత్‌లో స్టార్ హీరోయినా.? లేక, నార్త్ నుంచి తీసుకొస్తారా.? అనే విషయంలోనూ హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. మోస్ట్‌లీ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ అంటున్నారు.