అల్లు అర్జున్ ఇప్పుడు క్రికెట్ బ్యాట్ చేత బట్టారు. ఆయన సీరియస్‌గా క్రికెట్ నేర్చుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయకుండా ఇప్పటికిప్పుడు క్రికెట్ నేర్చుకోవాల్సిన అవసరం బన్నీకి ఏం వచ్చింది అనేగా మీ అనుమానం.. అక్కడికే వస్తున్నాం. బన్నీ ఇప్పుడు క్రికెట్ నేర్చుకుంటున్నది సరదా కోసం కాదు. పర్ఫెక్షన్ కోసం అట. ఆయన త్వరలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించబోతున్నారు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఆ టీమ్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర అందరికీ తెలిసే ఉంటుంది. తమిళనాడులో పుట్టి ఇండియన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ అయిన ఆయన కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కపిల్‌దేవ్ పాత్రను రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తన డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషన్స్, స్టైల్స్ సత్తా చూపించిన బన్ని ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూట్ చేస్తున్నారు. 2019 ప్రారంభంలో బన్నీకి సంబంధించిన పోర్షన్స్ తెరకెక్కిస్తారని వినికిడి. సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి సునీల్ గవాస్కర్, రావి శాస్త్రి తదితరుల పాత్రల కోసం ఎవరిని తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా అనువాదం చేసి విడుదల చేసే ఆలోచనలు ఉన్నాయట.