‘సితార’పాప కి అలియా స్పెషల్ గిఫ్ట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి , సితార కి సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సితార చేసే వీడియోలకి చాలామంది అభిమానూలు ఉన్నారు. అలాగే సితార డ్యాన్స్ వీడియోలకి వ్యూస్ భారీగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా చిన్నారిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ కూడా సితార కి మంచి ఫ్రెండ్.

2018లో మ‌హ‌ర్షి షూటింగ్ కోసం మ‌హేష్ త‌న ఫ్యామిలీతో న్యూయార్క్ వెళ్ల‌గా, అదే స‌మ‌యంలో అలియా భ‌ట్ మూవీ షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంలో అలియా, సితార మీటింగ్ జ‌రిగింది. అలియాని చూసి మురిసిపోయిన సితార ఆమెతో ఫొటో కూడా దిగింది. ఈ ఫొటోని న‌మ‌త్ర అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కోసం అలియా భ‌ట్ రీసెంట్‌గా హైద్రాబాద్‌లో అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ గారాల ప‌ట్టి సితార‌ని క‌లిసి ఆమెకి ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇచ్చింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు సితార‌కి ఇవ్వగా వాటిని చూసి మురిసిపోయిన లిటిల్ ప్రిన్స్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. నా కెంతో ఇష్ట‌మైన న‌టి అలియా భ‌ట్ ఈ డ్రెస్ తీసుకొచ్చింది, ఇది నాకెంతో న‌చ్చింది. చాలా సంతోషంగా ఉంది. ధ‌న్య‌వాదాలు అంటూ ట్విట్ చేసింది.