అల ప్ర‌చార‌ ఈవెంట్ ర‌ద్దు.. ఇదే కార‌ణం

అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ తో బ‌న్ని తిరిగి నూత‌నోత్సాహంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే మూడ్ లో అల స‌క్సెస్ వేడుక‌ల్ని ఘ‌నంగా ప్లాన్ చేశారు. త్వ‌ర‌లో తిరుప‌తిలో ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌న్న‌ది ప్లాన్. అయితే ఈ వేడుక‌ను మ‌ధ్య‌స్థంగా క్యాన్సిల్ చేశార‌ని తెలుస్తోంది.

నిన్న‌టిరోజున బ‌న్ని మేన‌మామ‌.. ఏఏ 20 నిర్మాత ముత్తం శెట్టి రాజేంద్ర ప్ర‌సాద్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. గుండె నొప్పితో ఆయ‌న ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అల్లు ఫ్యామిలీని తీవ్ర శోకంలోకి తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు ఈవెంట్ ని క్యాన్సిల్ చేశార‌ని తెలుస్తోంది. ద‌శ‌దిన క‌ర్మ‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ అన్ని ఈవెంట్లు క్యాన్సిల్ చేశారు. ఇక ఏ వేడుక‌కు అల్లు అర్జున్ హాజ‌రు కాలేరు. ఇక ఈలోగానే ఇతర చిత్ర‌బృందం సక్సెస్ వేడుక‌ల్ని నిర్వ‌హించాల్సి ఉంటుంది.