తెలుసా? :‘2.0’ లో అక్షయ్ లాంటి వ్యక్తి నిజంగానే ఉన్నారు

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’ భారీ అంచనాల మధ్య నిన్నటి రోజు అనగా గురువారం విడుదలైంది. అభిమానులు ఈ సినిమా రిలీజ్ ని ఓ ఉత్సవంలా జరుపుకొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పక్షి రాజా పాత్రకు మంచి ప్రశంశలు లభిస్తున్నారు. 2.0 సక్సెస్ సాధించడంలో ఈ పాత్ర చాలా కీలకమైంది.

దర్శకుడు శంకర్ …ఈ పాత్రను నిజ జీవితంలో సలీమ్ అలీ అనే పక్షి శాస్త్రవేత్తను ప్రేరణగా తీసుకొని శంకర్ ఈ పాత్రను సృష్టించాడు. సలీం అలీ కూడా బర్డ్ లవర్. పక్షుల రక్షణ కోసం ఎంత గానో కృషి చేశారు ఆయన. అందుకే ఆయనకు ఫాదర్ అఫ్ ఇండియన్ బర్డ్స్ అనే బిరుదు లభించింది. సలీం అలీ జీవీతాన్ని ఆదర్శంగా తీసుకొని శంకర్ సృష్టించిన పక్షి రాజా పాత్రలో అక్షయ్ అద్బుతంగా జీవించారు.

ట్రేడ్ వర్గాలు వారు ఊహించినట్లుగానే ఈ చిత్రం మొదటి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ట్రాక్ లోకి వచ్చారు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ లో రూ. 12.53 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే రానున్న రోజుల్లో బాక్సాఫిస్ వద్ద ఇదే జోరును కొనసాగించాల్సిన అవసరం వుంది.